వైద్యులు లేకుండా వైద్య శిబిరాలు

ప్రజాశక్తి-పెదబయలు :  మారుమూల గోమాంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శనివారం పోయిపల్లి పంచాయతీ రంగులోయాగ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం గోమాంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఇద్దరు వైద్య అధికార్లు లేకుండానే వైద్య శిభిరం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. మారుమూల గ్రామాలు కావడంతో ఎవ్వరు అడిగే పరిస్థితి లేకపోవడంతో మెడికల్ అధికార్లు తరుచు గైహాజర్ అవుతున్న క్రింద స్థాయి సిబ్బంది తో నామ మాత్రపు వైద్య శిబిరాలు నిర్వహించి చేతులు దులుపుకొంటూ అమాయక గిరిజనులకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ శనివారం రంగులోయలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరమే.. పెదబయలు మండల పరిధిలో గల, గోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మారుమూల గ్రామాలు ఎక్కువ. ఇదే పి హెచ్ ఫై ఆధారపడి వైద్య సేవాలు పొందాలి కాని డుమ్మా కొట్టె వైద్యులతో ఎలా సేవాలు పొందేదాని పలువురురోగులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. మెడికల్ అధికార్లు గైరుహజరు కావడం వల్ల వివిధ రకాల తో బాధపడుతున్న రోగులను వైద్య పరీక్ష చేసి తగిన వైద్యము, మందులు అందించవలసి ఉండగా, అదేమీ జరగలేదు కేవలం
హె వి, ఎం ఎల్ హెచ్ పి లు హాజరై వైద్య శిబిరం నిర్వహించి చేతులు దులుపు కొన్నారు.ముఖ్య మైన అధికారి లేకుండానే విద్య శిభిరం నిర్వహించటం శోచనీయంగా ఉందని పలూరు ఆరోపిస్తున్నారు,నామ మాత్రపు విద్య శిభిరం ఎర్పాటు చేసి చేతులు దులుపుకున్నా గైహాజరైన వైద్యది అధికారులపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనిపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని రంగులోయ గ్రామంలో పబ్లిక్ గా చెప్పుకోవడం కోసమేరుపు.

➡️