13 మంది మిలీసియా సభ్యుల లొంగుబాటు

May 27,2024 00:04
మాట్లాడుతున్న ఎస్‌పి తుహిన్‌ సిన్హ

ప్రజాశక్తి-పాడేరు:పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 13 మంది మిలీషియా సభ్యులు ఆదివారం అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ, లొంగిపోయిన 13 మంది 2016 నుండి మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశాల ఏర్పాటు… భోజన వసతి . కరువు దాడి… దారులు చూపించడం వంటి పనులను నిర్వహిస్తూ మావోయిస్టులకు సహకరించే వారిని ఆయన తెలిపారు. వరుస ఎదురు కాల్పులు, సరెండర్లు, అరెస్టులతో పెదబయలు ఏరియాలో దిశా నిర్దేశం చేసే నాయకత్వం పార్టీలో లేకపోవడం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు, గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు తెలిపారు. పెదబయలు ఏరియాలో గిన్నెలకోట ప్రాంతానికి చెందిన 13 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగి పోయినట్లు ఎస్పీ తెలిపారు.

➡️