గొంతు ఎండిపోతుంది…

ప్రజాశక్తి-హుకుంపేట : అసలే ఎండాకాలం… ఓ వైపు ఎండ మండుతుంది… మరోవైపు గొంతు ఎండిపోతుంది… గొంతు తడుపుకోవడానికి కనీసం తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరు వలస గ్రామంలో పరిస్థితి ఇది. తాగునీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. సరైన ఊట లేకపోవడంతో వేసవికాలంలో నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాగునీటి సౌకర్యాలు అరకొరగా అందుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన కుళాయిలు ద్వారా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో బూరు వలస గ్రామంలో 200 కుటుంబాలు ఉన్నాయి. గ్రామస్తులకు మాత్రం సరైన నీరు లేక నాన్న తిప్పలు పడుతున్నారు. గతంలో ఇచ్చిన సోలార్ ప్లాంట్  మరమత్తులకు గురై దిష్టిబొమ్మలాగా దర్శనమిస్తుంది.  సోలార్ ప్లాంట్ కి పలుమార్లు గ్రామస్తులే చందాలు వేసుకొని మరమ్మతులు చేపట్టారు. అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. ఎవరు వస్తారు ఏదో చేస్తారు అని.. కాకుండా గ్రామస్తులు అంత చందాలేసుకొని శుక్రవారం అందరూ కలిసి నీళ్లు నిలువ చేసేందుకు ట్యాంకు ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా పనులు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను దృష్టిలో పెట్టి గ్రామానికి పూర్తిస్థాయిలో త్రాగు నీరు అందించాలని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️