గిరిజనుల ఆందోళన

Apr 20,2024 00:25
నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-అనంతగిరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం, సరకులు తమ ప్రాంతంలోనే ఇవ్వాలని గిరిజనులు ఆందోళన చేపట్టారు. మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ రొంపల్లి పంచాయతీ చిన్నకోనెల, బూరిగా గ్రామాలకు చెందిన సుమారు 30 కుటుంబాలకు అనంతగిరి మండలం పరిధి రొంపల్లి లేదా ఎన్‌ ఆర్‌ పురం పంచాయతీ డియర్‌ డిపో నుండి ఆయా గ్రామలకు రేషన్‌ బియ్యం, సరుకులు పంపిణి చేయవలసి ఉంది. కానీ, విజయనగరం జిల్లా లోతుగడ్డ పంచాయతీ సారడవలస డిపోలో సరుకులు విడిపించు కోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రాను పోను 16 కిలోమీటర్లు కొండ కొండల నడుమ నుండి భుజంపై మోసి గ్రామాలకు చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామాలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేసే వాహనంలో సరఫరా చేయాలని వార్డు మెంబర్‌ సోమ్మెల అప్పాలరాజు, గ్రామస్తులు సింహచలం, బి సన్యాసి రావు డిమాండ్‌ చేశారు. లేని పక్షాన తహాశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు

➡️