గాయం కాలికి… ఆపరేషన్ ప్రైవేట్ పార్ట్ కి…

Jun 29,2024 13:21 #Doctors, #health, #Maharashtra

మహారాష్ట్ర : ఓ బాలుడి కాలికి చేయాల్సిన ఆపరేషన్ డాక్టర్లు ప్రైవేటు పార్ట్ కి చేసిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. జిల్లాలోని షాహాపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడి కాలుకు గాయం కావాడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతని ప్రైవేట్ పార్ట్‌కు శస్త్రచికిత్స చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు  తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ “గత నెలలో తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో బాబు కాలికి గాయమైంది. జూన్ 15న షాహాపూర్‌లోని  జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయపడిన కాలుకు బదులుగా అతని ప్రైవేట్ పార్ట్‌కు వైద్యులు ఇటీవల  శస్త్రచికిత్స చేశారు. తర్వాత గుర్తించిన వైద్యులు గాయపడిన కాలికి వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారని” పేర్కొన్నారు. తల్లిదండ్రులు షహాపూర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కానప్పటికీ, ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు. జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ కైలాస్ పవార్ ఆరోపణలపై ఆరోగ్య అధికారులు విచారణ జరుపుతారని తెలిపారు. ఆసుపత్రి వైద్యాధికారి గజేంద్ర పవార్ విలేఖరులతో మాట్లాడుతూ… బాలుడికి కాలికి గాయం కాకుండా, ఫిమోసిస్ (ప్రైవేటు పార్ట్ కి సంబంధించిన) సమస్య కూడా ఉందని చెప్పారు. అందువల్ల మేము రెండు ఆపరేషన్లు చేయవలసి వచ్చింది”అని తెలిపారు. అయితే రెండవ ఆపరేషన్ గురించి తల్లిదండ్రులకు తెలియజేయడంలో వైద్యుల పొరపాటు ఉండచ్చని తెలిపారు. అయితే వైద్యులు ఇచ్చిన వివరణను తల్లిదండ్రులు అంగీకరించడం లేదు.

➡️