వాలంటీర్లు రాజీనామా

Apr 16,2024 00:05
రాజీనామా లేఖలు చూపుతున్న వాలంటీర్లు

ప్రజాశక్తి-చింతపల్లి:మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు సమర్పిస్తున్నామని వాలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు వేములపూడి పరమేశ్వరరావు తెలిపారు. ఆయా పంచాయతీల కార్యదర్శులకు, ఎంపీడీవో వీర సాయిబాబాకు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా పరమేశ్వర రావు మాట్లాడుతూ వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మరలా సిఎంగా గెలిపిం చేందుకు కృషి చేస్తామన్నారు. సుమారు 190 మందికి పైగా వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు సమర్పించారని తెలిపారు.ఎన్నికల నియమావళిని అనుసరించి తమ సేవలను ప్రజలకు అందించకుండా ప్రతిపక్షాలు కుట్ర చేశాయని విమర్శించారు. పాడేరు, అరకు వైసిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్‌ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు.

➡️