ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ పోటీలు

Jan 25,2024 00:22
నర్సీపట్నంలో పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గణేష్‌

ప్రజాశక్తి -మాడుగుల: ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని డిప్యూటీ సియం బూడి ముత్యాలనాయుడు అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక జూనియర్‌ కళాశాల ఆట స్థలంలో ఏర్పాటు చేసిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో బూడి ముత్యాల నాయుడు పాల్గొని మాట్లాడారు. యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు, ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. వార్డు, గ్రామస్థాయి నుండి పోటీలు నిర్వహించడంతో యువతకు, పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కీముడు రమణమ్మ, ఎంపిడిఓ మాజీ ఎంపీపీ రామ ధర్మజా, మండల పార్టీ అధ్యక్షులు రాజారాం, మాడుగుల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సేనాపతి కొండలరావు, గ్రామ సర్పంచులు యడ్ల కళావతి , కరణం రాము, శ్రీనాథ శ్రీనివాసరావు,బొమ్మిశెట్టి శ్రీను మండల గ్రామస్థాయి నాయకులు, అధికారులు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నక్కపల్లి:ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గస్థాయి బాలుర విభాగం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వివిధ జట్లను జట్లను డిప్యూటీ కలెక్టర్‌ మహేష్‌, పాయకరావుపేట నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త కంబాల జోగులు, వైసిపి నాయకులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు విజేతలను అభినందించారు. వాలీబాల్‌ విన్నర్స్‌ విభాగంలో కోటవురట్ల, ఖోఖో ఎస్‌.రాయవరం, కబడ్డీ నక్కపల్లి, క్రికెట్‌ పాయకరావుపేట, బ్యాడ్మింటన్‌ పాయకరావుపేట జట్లు ప్రధమస్ధానాలను కైవసం చేసుకున్నాయి. ద్వితీయ స్ధానాలను వాలీబాల్‌ విభాగంలో పాయకరావుపేట, ఖోఖో పాయకరావుపేట, కబడ్డీ కోటవురట్ల, క్రికెట్‌ నక్కపల్లి, బ్యాడ్మింటన్‌ కోట ఉరట్ల విభాగాలు కైవశం చేసుకున్నాయి. గురువారం నుండి బాలికల విభాగం ఫైనల్స్‌ పోటీలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంటౌన్‌: నర్సీపట్నం నియోజకవర్గ స్థాయి ”ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ బుధవారం ప్రారంభించారు. క్రికెట్‌, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడలలో సచివాలయం, మండల స్థాయిలో విజేతలైన జట్టులకు జిల్లా స్థాయికి అర్హత సాధించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు ఆడుదాం ఆంధ్ర ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని, గెలుపు ఓటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలని ఆర్డీవో జయరాం క్రీడాకారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత నెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలను ప్రారంభించారని, సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు శక్తి వంచన లేకుండా కృషి చేసి నర్సీపట్నానికి రాష్ట్రంలో మంచి పేరు తీసుకు రావాలన్నారు. క్రీడాకారులను వెలుగులోకి తీసుకు వస్తున్న ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, పట్టణ వైసిపి అధ్యక్షుడు యాకా శివ, నాలుగు మండలాల ఎంపీడీవోలు, కోఆర్డినేటర్‌ ఆర్‌ శ్రీనివాస నాయుడు, వైయస్సార్‌ నాయకులు, మహిళా నాయకులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.ఉత్సాహంగా పోటీలు భీమునిపట్నం : స్థానిక జివిఎంసి మినీ, క్రికెట్‌ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా నియోజకవర్గ స్థాయి పోటీలు బుధవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఆర్‌డి ఎస్‌ భాస్కరరెడ్డి, తహసీల్దార్‌ సిహెచ్‌ వి రమేష్‌, ఎంపిడిఒ డాక్టర్‌ వి జానకి, జెడ్‌సి బొడ్డేపల్లి రాము, 24మంది పిఇటిలు పాల్గొన్నారు. బుధవారం పురుషుల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. క్రికెట్‌ పోటీల్లో పద్మనాభం మండలం కోరాడ గ్రామ సచివాలయం జట్టుపై ఆనందపురం మండలం, మామిడిలోవ గ్రామ సచివాలయం జట్టు గెలిచింది. కబడ్డీలో రెండో వార్డు నమ్మివానిపేట జట్టుపై రేవళ్ళ పాలెం జట్టు గెలిచింది. వాలీబాల్‌లో రెండో జోన్‌ నగరంపాలెం జట్టుపై భీమిలి మండలం, మూలకుద్దు, జట్టు గెలిచింది. సీతమ్మధార : యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆడుదాం. ఆంధ్రా ఆటలపోటీలను ప్రవేశపెట్టారని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు అన్నారు. బుధవారం కైలాసపురం డిఎల్‌బి గ్రౌండ్స్‌లో ఆటలపోటీల ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌డిసి అఖిల, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ అల్లు శంకరరావు, డిఇఇ భరణిి, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్‌రాజు, పి.ఉషశ్రీ, రెయ్యి వెంకట రమణ, కెవిఎస్‌. శశికళ, కోఆప్షన్‌ సభ్యులు సేనాపతి అప్పారావు, నీలి రవి, బులుసు జగదీశ్‌, పేడాడ రమణికుమారి, ఆళ్ల శివ గణేష్‌, కృష్ణారావు మాస్టర్‌, అంబటి శైలేష్‌, వసంతల అప్పారావు, పైడి శ్రీను, బొడ్డేటి కిరణ్‌కుమార్‌, ప్రసన్న, సురేష్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️