ప్రైవేటు విత్తన దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రైవేటు విత్తన దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రజాశక్తి-దేవరాపల్లి : మండలంలో లైసెన్సు కలిగిన విత్తన దుకాణాలను నర్సీపట్నం ఎడిఎ టి శ్రీదేవి స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారి ఎల్‌వై కాంతమ్మ కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు . తనిఖీలో భాగంగా మన గ్రోమోర్‌ హేమ రైతు డిపో, శ్రీ చైతన్య రైతు డిపోలను తనిఖీ చేసి గోడౌన్‌లో స్టాక్‌ వివరాలు, రైతులకు ఇచ్చే బిల్‌ బుక్‌లను తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు బిల్లు ఇవ్వాలని, దుకాణంలో విత్తనాల ధరలు రైతులకు తెలిసేలా ధరల పట్టిక బోర్డు దుకాణం బయట పెట్టాలని. బిల్‌ బుక్‌లు ఎప్పటికప్పుడు సక్రమంగా రాసి ఉంచుకోవాలని, ఈ పాస్‌ మిషన్‌లో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌చేసి నమోదు చేయాలని ఆదేశించారు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా, లేదా అని దుకాణ యజమానులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకుని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

విత్తన దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎడిఎ

➡️