సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ విద్యార్థులు

సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ విద్యార్థులు

 

రాష్ట్రస్థాయి జూనియర్‌ ఉషు ఛాంపియన్‌షిప్‌ పోటీలకు

సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి – పరవాడ: ఈనెల 28న రాజమండ్రిలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ ఉషు ఛాంపియన్‌షిప్‌ పోటీలకు సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్‌ ఎన్‌.సీతాలక్ష్మి తెలిపారు. ఇటీవల సంస్కతి గ్లోబల్‌ స్కూల్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీలలో వివిధ విభాగలలో ప్రతిభ కనబర్చిన జూనియర్‌ బార్సు స్టీఫెన్‌ 45 కేజీల విభాగంలోనూ, భార్గవ్‌ 65కేజీలు, రాహుల్‌ 70కేజీలు, అభినవ్‌ 75కేజీల విభగంలోనూ క్రిష్‌ దేవని 70కేజీలు, జూనియర్‌ గర్ల్స్‌ హిమనిషి పర్మార్‌ 45కేజీలు, చార్మి 48కేజీలు, ఆర్చిత 52కేజీలు, సమృద్ధి 56 కేజీలు, రోషిణి 60కేజీల విభాగంలో పాల్గొంటారన్నారు. రాష్ట్రసాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతోపాటు కోచ్‌ రమ్యను పాఠశాల సిఇఒకె. నిశాంత్‌ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల సిఇఒ

➡️