ఎస్మాపై అంగన్వాడీలభగ్గు

మస్యలను పరిష్కరించాలని సమ్మె చేపడు

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపడుతున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీంతో,ఎస్మాపై అంగన్‌వాడీలు శనివారం భగ్గు మగ్గుమన్నారు. జిఒ 2 కాపీలను దగ్ధం చేశారు.అనకాపల్లి:అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెంబర్‌ 2ను విడుదల చేయడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. స్థానిక నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో మానవహారం చేపట్టి, జిఒ 2 కాపీలను దగ్ధం చేశారు. ‘ఎస్మా -గిస్మా – జాంతానై’ అంటూ నినదించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకర్రావు మాట్లాడుతూ గతంలో ఎస్మాలను ప్రయోగించిన ఇందిరాగాంధీ, జయలలిత వంటి వారికే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు తనూజ, కాసులమ్మ, కృష్ణవేణి, ఉమానారాయనమ్మ, గంటా శ్రీరామ్‌, డి. శ్రీను, డిడి వరలక్ష్మి, ఎం.అప్పలరాజు, భాస్కరరావు, పాల్గొన్నారు.చోడవరం : జీవో నెంబర్‌ 2 కాపీలను చోడవరం కొత్తూరు జంక్షన్‌లో అంగన్వాడీలు దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి.వరలక్ష్మి, నాయకులు కె.కాంతం, సూర్యకాంతం, మహాలక్ష్మి పాల్గొన్నారు.బుచ్చయ్యపేట : న జీవో 2 కాపీలను అంగన్వాడీ కార్యకర్తలు బుచ్చయ్యపేట నాలుగు రోడ్ల కూడలిలో దగ్ధం చేశారు. ర్యాలీ నిర్వహించి మానవాహారం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎస్‌వి నాయుడు, ఆది వరలక్ష్మి, ఆమ్మాజీ పాల్గొన్నారు.మునగపాక : మండల కేంద్రంay అంగన్వాడీలు శనివారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు, యూనియన్‌ నాయకులు తులసి, అంజలి, లక్ష్మీ, గంగా భవానీ, సరస్వతి, ఉమ పాల్గొన్నారు.పరవాడ : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన నిరనన కార్యక్రమంలో 26వ రోజు కొనసాగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.అచ్యుతాపురం : స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం ఆవరణలో రిలే నిరాహార దీక్ష శిబిరంలో అంగన్వాడీలు చెవిలో బంతిపూలు పెట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో బి.జయ, వరలక్ష్మి, రామలక్ష్మి, రూపా పాల్గొన్నారు.దేవరాపల్లి : మండల కేంద్రంలోని దీక్షా శిబిరం వద్ద శనివారం అంగన్‌వాడీలు ఒంటి కాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వ్యకాస నాయకులు డి.వెంకన్న, బిటి దొర, యూనియన్‌ నాయకులు జి.వరలక్ష్మి, పి కన్నతల్లి, సన్యాసమ్మ, కె. కోమలి, చెల్లయ్యమ్మ, జయ, రమణమ్మ పాల్గొన్నారు.కె.కోటపాడు : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు దాడి ఎరుకునాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం అంగన్వాడీల ఆందోళలనకు ఆయన మద్దతు తెలియజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎర్ర దేవుడు, గాడి ప్రసాద్‌, అంగన్వాడి నాయకులు డి.కుమారి, పి.భవాని పాల్గొన్నారు. 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభంఅనకాపల్లి:గత 26 రోజులుగా అంగనవాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడంతో ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకర్రావు, జి.కోటేశ్వరరావు, ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి, ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి తదితరులు అంగన్వాడీలకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, యూనియన్‌ నాయకులు ఎం.దుర్గారాణి, వి.వి.రమణమ్మ ఎం.వరలక్ష్మి. బి.రత్నం, వరలక్ష్మి, కె.భారతి పాల్గొన్నారు.నర్సీపట్నం టౌన్‌:పట్టణంలో అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు చేరింది. గంగిరెద్దుకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, ఏపి అంగ్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌( సిఐటియు) ప్రాజెక్టు నాయకులు డి.మహాలక్ష్మీ, సామ్రాజ్యం, వరలక్ష్మి, శోభా పాల్గొన్నారు.చీడికాడ: జీవో 2ను వెంటనే రద్దు చేయాలని మండల కేంద్రంలో చావిడి వద్ద జీవో కాపీలను మంటలో తగలబెట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం వేతనాల పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.జానకి, ఉమా, అమ్మాజీ, పద్మ పాల్గొన్నారు మాడుగుల: స్థానిక బస్టాండ్‌ ఆవరణలో అంగన్‌వాడీలు సమ్మెను కొనసాగించారు.మండల అంగన్వాడి ప్రాజెక్టు యూనియన్‌ నాయకులు ఆర్‌ రామలక్ష్మి, పార్వతి, ధనలక్ష్మి మాట్లాడుతూ, సమ్మె 26వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం సానుకూలత చూపించక పోవడం దారుణమన్నారు. ఎస్‌.రాయవరం: మండల కేంద్రంలో తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా శనివారం చేతులు జోడించి తమకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ అంగనవాడీలు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వెంకటలక్ష్మి, పద్మ, సీతారత్నం, సత్యవతి పాల్గొన్నారు.అంగన్వాడీలకు కెవిపిఎస్‌ మద్దతుగొలుగొండ:మండలంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు కెవిపిఎస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గత 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేస్తానని చొరవ చూపలేదన్నారు. విశాఖ కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 24 గంటల దీక్షకు దిగారు. శనివారం రాత్రి సమ్మె శిబిరంలోనే నిద్రించారు. సమ్మెనుద్దేశించి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి మాట్లాడుతూ సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోరాడుతున్న తమ పట్ల ప్రభుత్వం చాలా కర్కశంగా వ్యవహరించిందన్నారు. అంగన్‌వాడీల పోరాటానికి స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు అయోధ్యరాం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ మద్దతు తెలిపి మాట్లాడారు. దీక్షలో అర్బన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.నూకరత్నం, ఎం.వెంకటలక్ష్మి, ఎఐటియుసి నాయకులు పి.శ్యామలా దేవి, ఐఎఫ్‌టియు నాయకులు రామలక్ష్మి, సుజాత, సంతోషి, కనకమహాలక్ష్మి, పద్మ, పార్వతీదేవి పాల్గొన్నారు.ఎస్మా ప్రయోగం అమానుషం : సిపిఎం, సిఐటియుఅంగన్‌వాడీలపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జిఒ నెంబరు 2 ద్వారా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సిందేనన్నారు. ఎస్మా ప్రయోగాన్ని సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాసరావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ ఖండించారు. తగరపువలస: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులు స్థానిక వై జంక్షన్‌ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు భీమిలి జోన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగుతుందని, ఎస్మాకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు. ఈ దీక్షలకు యుటిఎఫ్‌ భీమిలి మండల కమిటీ మద్దతు తెలిపింది. యుటిఎఫ్‌ నాయకులు రాము, సిఐటియు జోన్‌ అధ్యక్షులు రవ్వ నరసింగరావు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) భీమిలి ప్రాజెక్ట్‌ గౌరవాధ్యక్షులు కె.వెంకటలక్ష్మి, జిల్లా కోశాధికారి కె.పద్మావతి, ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, కొవ్వాడ లక్ష్మి, దన లక్ష్మి, ఎఐటియుసి అనుబంధ సంఘం ప్రతినిధులు అనురాధ పాల్గొన్నారు పెందుర్తి : ఎంపిడిఒ కార్యాలయం అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు నిరాహారదీక్ష చేపట్టారు. అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఒ జారీ చేయడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్‌ తీవ్రంగా ఖండించారు.ఈ దీక్షలకు ఐద్వా నాయకులు బి.అనంతలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సూర్యకాంతం, జగ్గయ్యమ్మ, నాగమణి, లక్ష్మి, అప్పలనరసమ్మ, బృందావతి, భవాని తదితరులు పాల్గొన్నారు.

➡️