ఘనంగా వెంకన్న ఊరేగింపు

ఊరేగిస్తున్న అర్చకులు, గ్రామస్తులు

ప్రజాశక్తి- నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అశ్వ వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుని ఉత్సవమూర్తులను అంసవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్‌ ఆచార్యులు, కృష్ణమాచార్యులు, పీసపాటి వేంకట శేషాచార్యులు, నల్లాన్‌ చక్రవర్తుల శ్రీనివాసులు, నండూరి వెంకట రాజగోపాలాచార్యులు, ఇల్లింద వెంకట గోపాలచార్యులు, నండూరి వెంకట అప్పల రంగాచార్యులు, దేవస్థానం సిబ్బంది గురవయ్య గ్రామానికి చెందిన రేజేటి సింగరాచార్యులు, యు.వి. రంగనాధ స్వామి పలువురు భక్తులు పాల్గొన్నారు.

➡️