అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ తాడి గ్రామ పర్యటన

ప్రజాశక్తి – పరవాడ (అనకాపల్లి) : మండలంలోని తాడి గ్రామంలో మంగళవారం జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ వి అయ్యప్ప నాయుడు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈ ఈ పివి ముకుందరావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు మాదంశెట్టి నేల బాబు, మాజీ సర్పంచ్‌ బొడ్డపల్లి అప్పారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ తాడి గ్రామంలో పర్యటించి ఇటీవల నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా … సురక్షితమైన మంచినీరుని ప్రజలకి అందించడానికి అధికారులు పరిశీలించారు. రక్షిత మంచినీటి ట్యాంక్‌ ని పరిశీలించి, శాంపిల్స్‌ సేకరించారు. సురక్షితమైన మంచినీరు గ్రామ ప్రజలకు అందజేస్తామని జోనల్‌ కమిషనర్‌ తెలిపారు. బయటి నుండి సురక్షితమైన మంచినీరు తీసుకొచ్చి ఇస్తామని తెలిపారు. సురక్షమైన నీరు, మెడికల్‌ క్యాంపులు, కాలుష్యం అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కోమటి సూరిబాబు, కే.పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️