ఘనంగా వెంకన్న తిరువీధి సేవ

ఊరేగిస్తున్న భక్తులు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాజాధి రాజ వాహనంపై శ్రీనివాసుడు భూదేవి, శ్రీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. దాతల భాగస్వామ్యంతో రాజాధిరాజు వాహనంపై వైభవంగా తిరువీధి సేవ నిర్వహించారు.పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌ ఆచార్యులు ,ఇన్స్పెక్టర్‌ వెంకట కూర్మేశ్వరరావులు మాట్లాడుతూ టిటిడి అధికారుల ఆదేశాల మేరకు భక్తుల భాగస్వామ్యంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఎవరైనా స్వామి వారి సేవలను, భక్తులకు ఉచిత అన్నప్రసాదాలను పంపిణీ చేయించాలనుకుంటే ముందుగా దేవాలయం సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.

➡️