జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Jan 19,2024 00:15
ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: ఖెలో ఇండియా సౌత్‌ జోన్‌ నేషనల్‌ వూషూ ఛాంపియన్షిప్‌ పోటీల్లో నర్సీపట్నం నుండి ఏడుగురు వూష ఫైటర్స్‌ పాల్గొంటున్నారని జడ్పీ హైస్కూల్‌ క్రీడా అధ్యాపకులు దేవి తెలిపారు. ఈనెల 19 నుండి 22 వరకు తమిళనాడులో జరిగే పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ టీం తరపున రాజరాజేశ్వరి, శర్వాణి, శరణ్య, నివేదిత, బిందు, శ్రీదివ్య, హారిక, అంకిత పాల్గొంటున్నారని పేర్కొన్నారు.సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలికల కేటగిరిలో చెట్టుపల్లి జడ్పీ హై స్కూల్‌కి చెందిన ముగ్గురు బాలికలు ప్రతి రోజూ నర్సీపట్నంలో తీసుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరసింహరావు, నింజాస్‌ అకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ బోలెం శివ, వూషు సీనియర్‌ కోచ్‌ యర్రా శేఖర్‌ అభినందించారు.

➡️