జైల్‌భరో ఉద్రిక్తం

అనకాపల్లిలో నిరసన తెలుపుతున్న పలు సంఘాల నేతలు

ప్రజాశక్తి- యంత్రాంగం విశాఖ కలెక్టరేట్‌ : అంగన్‌వాడీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన నిరంకుశ ఎస్మా చట్టాన్ని నిలిపేయాలని, మున్సిపల్‌ కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన మంగళవారం విశాఖలో జైల్‌ భరో నిర్వహించారు. ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలోని బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులను బాటా జంక్షన్‌ వద్ద వందలాది మంది పోలీసులు అడ్డుకొని సుమారు 300 మందిని అరెస్టు చేసి పోలీస్‌ బ్యారెక్స్‌లో నిర్బంధించారు. అరెస్టులకు ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన సభలో విశాఖ జిల్లా కార్మిక ప్రజాసంఘాల జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ ఎం.మన్మధరావు మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్మికులపై ఎస్మాను ప్రయోగించి తన నిరంకుశ పాలనను నిరూపించుకుందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వం అరెస్టులు చేయించి పోలీస్‌ స్టేషన్లో నిర్బంధిస్తోందని, కార్మికుల ప్రజాతంత్ర హక్కులను హరిస్తోందని, నిరంకుశ చట్టాలు, నిర్బంధాలు ఆపకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధ పద్దతులను విడనాడి అంగన్‌వాడీ, మునిసిపల్‌, సర్వ శిక్ష అభియాన్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జైల్‌ భరో కార్యక్రమం అరెస్ట్‌ అయిన వారిలో సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాస్‌, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు పడాల రమణ, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి కె.మల్లయ్య, ప్రజాపోరు నాయకులు దేవా, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి.మణి, ఐద్వా జిల్లా నాయకులు బి.ఈశ్వరమ్మ, కె.ప్రభావతి, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు కె.సంతోష్‌కుమార్‌, కె.శ్రావణ్‌కుమార్‌, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఎం.చంటి, వై.అప్పారావు, సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, డి.అప్పలరాజు, ఎ.నరేంద్రకుమార్‌, వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, జి.అప్పలరాజు, ఒ.అప్పారావు, పి.పైడిరాజు, ఎం.రాంబాబు, ఆర్‌.లక్ష్మణమూర్తి, ఉరుకూటి రాజు, టి.నూకరాజు, కె.అప్పలనాయుడు, కె.పెంటారావు, ఎఐటియుసి నాయకులు సిహెచ్‌.కాసుబాబు, శ్యామల తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు, అసంఘటిత రంగ కార్మికులతో పాటు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనకాపల్లి:అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన మంగళవారం జైలుభరో నిర్వహించారు. ఇందులో భాగంగా అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలి నుండి దిశా పోలీస్‌ స్టేషన్‌ మీదగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడి వర్కర్లు 20 రోజులు ముందే సమ్మె నోటీస్‌ ఇచ్చి, 29 రోజులుగా సమ్మెలో ఉన్నారని, సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు అత్యవసర విభాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆర్‌.శంకర్రావు జి.కోటేశ్వరరావు, వైఎన్‌.భద్రం, కోన మోహన్‌, నాయనబాబు, పి మాణిక్యం, శంకర్రావు, పివిఎన్‌. పరమేశ్వరరావు, శ్రీరామ్‌, ఉమామహేశ్వరరావు, రాజు, శివ, సంతోష్‌ పాల్గొన్నారు.పరవాడ : అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల్లో భాగంగా పరవాడ సినిమా హాల్‌ జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేపట్టారు. వైస్‌ జగన్‌ ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు అప్పారావు కే.నాయుడు, జి శ్రీను, ఎన్‌ గురునాధరావు పాల్గొన్నారు.ప్రజాశక్తి- యంత్రాంగం విశాఖ కలెక్టరేట్‌ : అంగన్‌వాడీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన నిరంకుశ ఎస్మా చట్టాన్ని నిలిపేయాలని, మున్సిపల్‌ కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన మంగళవారం విశాఖలో జైల్‌ భరో నిర్వహించారు. ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలోని బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులను బాటా జంక్షన్‌ వద్ద వందలాది మంది పోలీసులు అడ్డుకొని సుమారు 300 మందిని అరెస్టు చేసి పోలీస్‌ బ్యారెక్స్‌లో నిర్బంధించారు. అరెస్టులకు ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన సభలో విశాఖ జిల్లా కార్మిక ప్రజాసంఘాల జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ ఎం.మన్మధరావు మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్మికులపై ఎస్మాను ప్రయోగించి తన నిరంకుశ పాలనను నిరూపించుకుందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వం అరెస్టులు చేయించి పోలీస్‌ స్టేషన్లో నిర్బంధిస్తోందని, కార్మికుల ప్రజాతంత్ర హక్కులను హరిస్తోందని, నిరంకుశ చట్టాలు, నిర్బంధాలు ఆపకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధ పద్దతులను విడనాడి అంగన్‌వాడీ, మునిసిపల్‌, సర్వ శిక్ష అభియాన్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జైల్‌ భరో కార్యక్రమం అరెస్ట్‌ అయిన వారిలో సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాస్‌, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు పడాల రమణ, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి కె.మల్లయ్య, ప్రజాపోరు నాయకులు దేవా, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి.మణి, ఐద్వా జిల్లా నాయకులు బి.ఈశ్వరమ్మ, కె.ప్రభావతి, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు కె.సంతోష్‌కుమార్‌, కె.శ్రావణ్‌కుమార్‌, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఎం.చంటి, వై.అప్పారావు, సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, డి.అప్పలరాజు, ఎ.నరేంద్రకుమార్‌, వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, జి.అప్పలరాజు, ఒ.అప్పారావు, పి.పైడిరాజు, ఎం.రాంబాబు, ఆర్‌.లక్ష్మణమూర్తి, ఉరుకూటి రాజు, టి.నూకరాజు, కె.అప్పలనాయుడు, కె.పెంటారావు, ఎఐటియుసి నాయకులు సిహెచ్‌.కాసుబాబు, శ్యామల తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు, అసంఘటిత రంగ కార్మికులతో పాటు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనకాపల్లి:అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన మంగళవారం జైలుభరో నిర్వహించారు. ఇందులో భాగంగా అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలి నుండి దిశా పోలీస్‌ స్టేషన్‌ మీదగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు. అంగన్వాడి వర్కర్లు 20 రోజులు ముందే సమ్మె నోటీస్‌ ఇచ్చి, 29 రోజులుగా సమ్మెలో ఉన్నారని, సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు అత్యవసర విభాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఆర్‌.శంకర్రావు జి.కోటేశ్వరరావు, వైఎన్‌.భద్రం, కోన మోహన్‌, నాయనబాబు, పి మాణిక్యం, శంకర్రావు, పివిఎన్‌. పరమేశ్వరరావు, శ్రీరామ్‌, ఉమామహేశ్వరరావు, రాజు, శివ, సంతోష్‌ పాల్గొన్నారు.పరవాడ : అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల్లో భాగంగా పరవాడ సినిమా హాల్‌ జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేపట్టారు. వైస్‌ జగన్‌ ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు అప్పారావు కే.నాయుడు, జి శ్రీను, ఎన్‌ గురునాధరావు పాల్గొన్నారు.

➡️