త్వరితగతిన పనులు : ఎమ్మెల్యే గణేష్‌

Jan 23,2024 00:04
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌: మున్సిపాలిటీ 28వ వార్డులో మౌలిక సదుపాయాలకు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ సోమవారం శంకుస్థాపనలు చేశారు. వార్డులోని అయ్యన్న కాలనీలో రూ.7 లక్షలతో రెండు సిసి రోడ్ల నిర్మాణానికి, రూ.2 లక్షలతో మంచినీటి బోర్‌ వెల్‌ తాగునీటి సరఫరా, గుర్రాల రోడ్డులో రూ 6 లక్షలతో రెండు డ్రైనేజీలు, రూ.15 లక్షలతో 4 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. మొదటి విడతగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17 సచివాలయాల పరిధిలో రూ.3 కోట్ల 40 లక్షలతో 110 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మున్సిపాలిటీలోని ఒక్కో సచివాలయానికి మరో రూ.30 లక్షల చొప్పున రూ.5 కోట్ల 10 లక్షలు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో 170 అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికే మంజూరైన పనులలో 140 పనులు పూర్తి చేశామని, 50 పనులు నిర్మాణంలో ఉన్నాయని, మిగతా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ వైసిపి అధ్యక్షుడు శివ, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, కౌన్సిలర్‌ శిరసపల్లి నాని, వార్డు వైసిపి ఇన్చార్జ్‌ తెన్నేటి జాన్సన్‌, పట్టణ మహిళా కార్యదర్శి గంటా లలిత, కార్పొరేషన్‌ డైరెక్టర్లు చోటీ, అర్జున వెంకటరావు, కో ఆప్షన్‌ సభ్యురాలు రోజా, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మళ్ల గణేష్‌, పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆరుగొల్లు రాజబాబు, మాజీ వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి, మున్సిపల్‌ డి ఈ నారాయణ, ఏఈ రవి తదితరులు పాల్గొన్నారు.

➡️