నక్కపల్లిలో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలుప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృంధం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం తెల్లవారి నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీతో కిటకిటలాడింది.క్యూ లైన్‌ లో భక్తులు బారులు తీరారు..పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 8 వాహనాల్లో తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చకులు సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు . రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అలంకరణ చేశారు. భజనలు, నగర సంకీర్తనలు అలరించాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

నక్కపల్లిలో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు

xప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృంధం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం తెల్లవారి నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీతో కిటకిటలాడింది.క్యూ లైన్‌ లో భక్తులు బారులు తీరారు..పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 8 వాహనాల్లో తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చకులు సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు . రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అలంకరణ చేశారు. భజనలు, నగర సంకీర్తనలు అలరించాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

➡️