నాడు నేడుతో పాఠశాలలు అభివృద్ధి

మాట్లాడుతున్న ఎంపీ సత్యవతి

ప్రజాశక్తి -నక్కపల్లి:స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో తరగతి భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు, రాజాం ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త కంబాల జోగులుతో కలిసి ఎంపీ బి.సత్యవతి ఆదివారం శంకుస్థాపన చేశారు. స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా సిఎస్‌ఆర్‌ ఫండ్స్‌ నుండి నిధులు మంజూరు చేయడంతో అసంపూర్తిగా నిలిచిన తరగతి భవన నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చారన్నారు. విద్యారంగానికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. విద్యారంగం అభివృద్ధికి సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మంజూరు చేసిన 30 లక్షలతో తరగతుల నిర్మాణం, టాయిలెట్స్‌ పనులు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులు పూర్తిగా చేసేందుకు గాను మరో 30 లక్షలు మంజూరు చేయాలని స్టీల్‌ అథారిటీ ఇండియా వారిని అడిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఎంపీపీ రత్నం, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, సర్పంచ్‌ జయ రత్నకుమారి, వైస్‌ ఎంపీపీలు నానాజీ, ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి, ఎంఈఓ నరేష్‌, కేజీబీవీ ప్రత్యేక అధికారిని షేక్‌ షలీమా, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️