న్యాయవాదుల గుమస్తాల కార్యవర్గం ఎన్నిక

ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:నర్సీపట్నం న్యాయవాదుల గుమస్తాల అసోసియేషన్‌ సమావేశం ఆదివారం పాత కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వి.హనుమంతరావు, ప్రెసిడెంట్‌గా టి.ప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా బి.బాపిరాజు, సెక్రటరీగా డి.రమణ, జాయింట్‌ సెక్రటరీగా ఆర్‌.తిరుపతయ్య, కోశాధికారిగా జి.తాతాలు, ఆర్గనైజేషన్‌ కె.నూకరాజు, సాయి, రాజబాబు, గణేష్‌, దారబాబు, లక్ష్మణరావు, కన్నయ్య, నాయుడు, అప్పలనాయుడు ఎన్నికయ్యారు.

➡️