ఒప్పో నుంచి ఎ3ప్రో

Jun 24,2024 20:34 #Business, #mobile phones

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో కొత్తగా తన ఒప్పో ఏ3 ప్రోను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏప్రిల్‌లో చైనాలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, 50-మెగా పిక్సెల్‌ డ్యుయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 8జిబి ర్యామ్‌ విత్‌ 128జిబి స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ.17,999గా, 8జిబి ర్యామ్‌, 256 జిబి స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ.19,999గా నిర్ణయించింది. ఒప్పో ఏ3 ప్రో ఫోన్‌ 50 ఎంపి ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు డ్యుయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ సహా సెల్ఫీ కోసం 8ఎంపి కెమెరాను అమర్చింది.

➡️