పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు

మాట్లాడుతున్న అనకాపల్లి ఎంపి సత్యవతి

 

ప్రజాశక్తి-రోలుగుంట:పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో దేశంలోనే ఆంద్ర రాష్ట్రం ముందుందని అనకాపల్లి ఎంపి భీశెట్టి వెంకట సత్యవతి అన్నారు. సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రోలుగుంట మండల కేంద్రం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే రోల్‌ మోడల్‌గా జగన్‌ ప్రభుత్వం నిలిచిందన్నారు. అన్ని వర్గాల వారికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్‌గణేష్‌, గొల్ల బాబురావు, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️