ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jan 17,2024 23:45
భవనాన్ని ప్రారంభిస్తున్న బూడి

ప్రజాశక్తి -చీడికాడ:రామాలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. వైసిపి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని ఎప్పుడూ ప్రజాసంక్షేమం కోసమే పాటుపడుతుందన్నారు. మండలంలోని బైలపూడి గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా హెల్త్‌ సెంటర్‌, సచివాలయం భవనాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రతి వీధిలో తిరిగి రామాలయం నుండి పాల కేంద్రం వరకు సిసి రోడ్‌ నిర్మాణానికి రూ.40 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పురాతన రామాలయం శిధిలమై నందున పునర్నిర్మానికి రూ.10 లక్షలు కేటాయించడంతో పాటు తన సొంత నిధులు లక్ష రూపాయలు ఇస్తానని ఆయన ప్రజలకు తెలిపారు. గ్రామంలో మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారులకు తెలియజేస్తే తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజబాబు. గ్రామ సర్పంచ్‌ జాజిమొగ్గల గంగ తల్లి సత్యనారాయణ వైసిపి నేతలు నారాయణమూర్తి, సోము నాయుడు, సుంకర శ్రీను, సుంకర వెంకటరావు, తోపాటు స్థానిక ఎస్సై నారాయణరావు, ఎంపీడీవో జయప్రకాష్‌ రావు, ఏవో కష్ణవేణి, పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది, వాలంటరీలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

➡️