భిక్షాటన… వంటావార్పు …

Dec 21,2023 00:37 #భిక్షాటన..
భిక్షాటన..

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భిక్షాటన, వంటావార్పు తో తమ నిరసన తెలియజేశారు. కశింకోట:అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె భాగంగా కసింకోట జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలంలో చేస్తున్న దీక్షా శిబిరాన్ని బుధవారం పుణ్యవతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని, బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చిన్నబ్బాయి, జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, జిల్లా నాయకురాలు డిడి.వరలక్ష్మి మద్దతు తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు, నాయకులు డి.శ్రీనివాసరావు, అంగన్వాడి యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగ శేషు, మండల నాయకులు తనుజ ,కాసులమ్మ పాల్గొన్నారు.కోటవురట్ల:అంగన్వాడీలతో పెట్టుకున్న ప్రభుత్వాలు అంతమొందిపోవడం తప్పదని ఐద్వా అఖిల భారత కోశాధికారి ఎస్‌.పుణ్యవతి అన్నారు. మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు 9వ రోజు చేపడుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు ఆమె హాజరై మాట్లాడుతూ, జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరితే సమ్మెను నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాల నుండి ర్యాలీగా తహసిల్దార్‌ కార్యాలయం వరకు వెళ్లి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకర్‌, రైతు సంఘం జిల్లా నాయకులు అప్పలరాజు, అంగన్వాడి జిల్లా యూనియన్‌ అధ్యక్షులు దుర్గారాణి, సుబ్బలక్ష్మి, చిన్నమ్మ, పుష్ప, రాజారత్నం, డేవిడ్రాజు లక్ష్మి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు మాజీ మంత్రి బండారు మద్దతుపరవాడ : పరవాడ తాసిల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి బుధవారం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎ.సన్యాసఅప్పారావు, ఎం అప్పలనాయుడు, వి కొండలరావు, బి తాతారావు పాల్గొన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం సంఘీభావం సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం అంగన్వాడీల శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం విచ్ఛిన్నం చేసే చర్యలు విరమించాలని, తాళాలు పగలకొట్టడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అంగన్వాడీల పోరాటాన్ని అణిచివేయాలని చూస్తే సాగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి రమణ, తదితరులు పాల్గొన్నారు. వైసిపి నాయకులు, ముత్యాలమ్మపాలెం మాజీ సర్పంచ్‌ చింతకాయలు ముత్యాలు సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, షాపుల్లో భిక్షాటన చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ దేవి, అమ్మాజీ, నీలిమ, కనక, పార్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.అచ్యుతాపురం : అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం భిక్షాటన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము, ఐద్వా మండల కన్వీనర్‌ ఆర్‌ లక్ష్మి, అంగనవాడీ యూనియన్‌ నాయకులు వరలక్ష్మి, బి. జయలక్ష్మి, ఎల్‌. రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.రాంబిల్లి : మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ చందక రామకృష్ణ, నాయకులు ఎరిపిల్లి రాము, బద్దిమంగా, నూకరత్నం, సుజాత, సంతోషి పాల్గొన్నారు.కె.కోటపాడు : అంగన్వాడీ వర్కర్లు బుధవారం మండల కేంద్రంలో నినాదాలు చేపడుతూ భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో జి కుమారి, భవాని, సిపిఎం నాయకులు గండి నాయన బాబు, ఎర్ర దేవుడు తదితరులు పాల్గొన్నారు.బుచ్చయ్యపేట : సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం బుచ్చయ్యపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద మానవహారంగా నిర్వహించారు. చీర కొంగు జోలె పట్టుకుని తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్రావు, యూనియన్‌ ప్రతినిధులు ఆది వరలక్ష్మి, ఎలిశెట్జి అమ్మాజీ, భానుమతి, ఈశ్వరి పాల్గొన్నారు.చోడవరం : అంగన్వాడీలు స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం వద్ద రిలే దీక్షలు బుధవారం కొనసాగించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదన్నారు.యలమంచిలి : అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరింది. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, సిఐటియు నాయకులు బి.శశికళ, జి.అప్పల రత్నం, అంగన్వాడీ వర్కర్స్‌ జి.ఉష, పి.హైమ, జి.సోమలక్షి తదితరులు పాల్గొన్నారు.దేవరాపల్లి : స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు నిరసన చేపట్టారు. తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేసి, మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో భిక్షాటన చేశారు. వీరికి సిఐటియు, సిపిఎం నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు వరలక్ష్మి, పద్మ, సన్యాసమ్మ,అమ్మాజీ, కోమలి పాల్గొన్నారు.మునగపాక రూరల్‌ : అంగన్వాడీలు తలపెట్టిన 9వ రోజు నిరసన శిబిరాన్ని బుధవారం సిఐటియు నాయకులు ఎస్‌ బ్రహ్మాజీ ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీలు రామలక్ష్మి, అంజలి, హేమలత, జయలక్ష్మి, ఉమాదేవి, సరస్వతి, తులసి లక్ష్మి, భవాని, లక్ష్మీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.నర్సీపట్నంటౌన్‌:అంగన్వాడీలు సమ్మెలో భాగంగా బుధవారం నర్సీపట్నంలో బిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, కనీసవేతనాలు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, నర్సీపట్నం కన్వీనర్‌ టి.ఈశ్వరావు, ఐద్వా జిల్లా ట్రేజరర్‌ కెెవి.సూర్యప్రభ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు వి.సామ్రాజ్యం, డి.మహలక్ష్మీ, కృష్ణవేణి, శోభా, నాగమణి పాల్గొన్నారు.రావికమతం: అంగన్వాడీల సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ, తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి న్యాయం చేయాలని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు బీ.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.గొలుగొండ:మండల కేంద్రంలో సిఐటియు జిల్లా సభ్యులు ఎం.మంగతాయి, డివిజన్‌ నాయకురాలు భ్రమరాంబ ఆధ్వర్యంలో భీక్షాటన చేశారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి నినాదాలు చేశారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సత్య, తోకల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వడ్డాది :అధికారుల ఆదేశాల మేరకు వాలంటరీలు, వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో అంగన్వాడీల నిర్వహణ తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి. లోపూడి 2 అంగన్వాడి కేంద్రాన్ని నామమాత్రంగా తెరిచారు. అంగన్వాడి పరిధిలో 14 మంది పిల్లలు ఉన్నా వారు కేంద్రానికి రాలేదు.ఎల్‌.సింగవరంలో అంగన్వాడి కేంద్రం నిర్వహించేవారే కరువయ్యారు.రోలుగుంట:తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోలుగుంటలో అంగన్వాడీలు బుధవారం బిక్షాటన చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించి వెంటనే తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు పాల్గొన్నారు. మాడుగుల: అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. మాడుగుల బస్టాండ్‌ సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తల వద్దకు జిల్లా డిసిసి అధ్యక్షుడు బొడ్డు శీను, నియోజకవర్గ ఇన్చార్జ్‌ పడాల కొండలరావులు సమ్మెలో పాల్గొన్నారు. భిక్షాటన చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యేసు రాజు, మై చర్ల జగ్గారావు, బోయిన అప్పారావు పాల్గొన్నారు. కేంద్రాలు తెరిచారు..నిర్వహణ మరిచారు..కోటవురట్ల:అంగన్‌వాడీల సమ్మెను భగ కలిగించే విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ, పోలీస్‌, రెవెన్యూ సిబ్బందితో తాళాలు బద్దలు కొట్టి కేంద్రాలను మంగళవారం తెరిపించింది. బుధవారం తెరచుకోకపోవడం విశేషం. కేవలం అంగన్వాడీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరించిందే గాని వాస్తవానికి చిన్నారులకు బాలింతలకు గర్భిణీలకు పోషక విలువల అందించాలన్న ఆలోచన ఎంత మాత్రం లేదంటూ పలువురు పలు సంఘాల నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.బుధవారం చాలా అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు కేంద్రాలకు వచ్చి వెనుతిరిగారు.విశాఖపట్నం : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరంలో ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి మాట్లాడారు. విఒఎలకు, ఆర్‌పిలకు అంగన్వాడీ సెంటర్లు అప్పజెప్పడం తగదన్నారు. అంగన్‌వాడీల పోరాటానికి జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నూకరాజు, ఉరుకూటి రాజు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సుధాకర్‌, సమగ్ర శిక్ష జెఎసి రాష్ట్ర అధ్యక్షులు కాంతారావు, సిఐటియు సీనియర్‌ నాయకులు బి.వెంకటరావు, యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి రాంబాబు మద్దతు తెలిపారు. పద్మనాభం : అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద భారీ ఎత్తున వంటావార్పు నిరసన చేపట్టారు. సిఐటియు నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి రవ్వ నర్సింగరావు, లక్ష్మి పాల్గొన్నారు.పెందుర్తి : అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం వంటావార్పు నిరసన చేపట్టారు. యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.బృందావతి మాట్లాడారు.సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి సరికాదని, వచ్చే ఎన్నికల్లో మాటిచ్చి, మడమ తిప్పిన సిఎంజగన్‌కు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.దేవి, నాయకులు బి.భవానీ, ఆర్‌ అనిత, సరస్వతి, కళ, చిన్నమ్మలు, సోమేశ్వరి, వేణు, జ్యోతి, గంగ పాల్గొన్నారు.

➡️