యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:యువగళం సభను విజయ వంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో ఇటీవల చేపట్టిన నారా లోకేష్‌ యువగళం సభ విజయవంతం చేశారన్నారు. రానున్న మూడు నెలలు సమయం ఉందని, దీని కోసం కార్యకర్తలు శ్రమించాలని కోరారు. యువగళం సభలో ప్రజలు చూపించిన అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చాలన్నారు. మరో మూడు నెలలు కష్టపడితే మన ప్రభుత్వం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల అధ్యక్షులు ఆర్‌వై.పాత్రుడు, నాతవరం మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, మాజీ ఎంపిపి శింగంపల్లి సన్యాసిదేముడు పాల్గొన్నారు.

➡️