రాష్ట్రంలో సంక్షేమ పాలన

గొలుగొండలో జెండాను ఆవిష్కరిస్తున్న నేతలు

ప్రజాశక్తి-గొలుగొండ:ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా సిఎం జగన్‌ పాలన అందిస్తున్నారని గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి మణికుమారి అన్నారు. మంగళవారం కొత్తఎల్లవరం గ్రామంలో ఏపికి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం డిస్‌ ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, పేదల ఆర్ధికాభివృద్దే ధ్యేయంగా సీఎం పాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు. పభుత్వ పథకాలపై ప్రచారంఆనందపురం : మండలంలోని వెల్లంకిలో ఎపికి జగన్‌ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన బోర్డు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసిపి పాలనలో చేపట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ అడపా లవరాజు, సర్పంచ్‌ ఉప్పాడ లక్ష్మణరావు, ఉప సర్పంచ్‌ కంచరాపు శ్రీను, భీమిలి వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ సూర్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షుడు బంక సత్యం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు, బొట్ట.రామకృష్ణ, పిన్నింటి వెంకటరమణ, సత్యం, కాకర వెంకటరమణ, మణిశంకర్‌ నాయుడు, యర్ర.బంగారు నాయుడు, శినగం దామోదర్‌ రావు పాల్గొన్నారు. సీతమ్మధార : వైసిపి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు ఆదేశాలతో వార్డు కార్పొరేటర్‌ కంపా హనోక్‌ ఆధ్వర్యంలో ఎపికి జగన్‌ ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పైడి రమణ, నాయకులు హరి పట్నాయక్‌ పాల్గొన్నారు.వేపగుంట : 52వ వార్డు శివనగర్‌ సచివాలయంలో నగర డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనందకుమార్‌ పాల్గొన్నారు. రజక వీధిలో రూ.18 లక్షలతో నిర్మించనున్న కళావేదికకు, మర్రిపాలెం ఉడా లేఅవుట్‌లో రూ.16లక్షలతో వార్డు సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 1.65 లక్షలతో అభివృద్ధి చేసిన బిటిరోడ్డును ప్రారంభించారు. వార్డు పరిధిలో రూ.6కోట్లతో చేపట్టిని అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాల బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ అల్ఫా కృష్ణ, వార్డు అధ్యక్షులు జియ్యాని మారుతి , వెదుళ్ల శ్రీను, శ్రీదేవివర్మ పాల్గొన్నారు.

➡️