షోకాజ్‌ నోటీసులపై నిరసనలు

Jan 19,2024 00:10
విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద..

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నిరసనలు కొనసాగించారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై నినాదాలు చేశారు. పలు చోట్ల వినూత్నంగా ఆందోళనలు కొనసాగించారు.కె.కోటపాడు : అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం వారికి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు రాతపూర్వకంగా సమాధానం తెలుపుతూ గురువారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.కుమారి, పి.భవానీ, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు గాడి ప్రసాదు, అంగన్వాడీలు పాల్గొన్నారు.నక్కపల్లి:తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడి వర్కర్స్‌ చేపట్టిన సమ్మె గురువారం నాటికి 38వ రోజుకు చేరింది. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగనవాడి వర్కర్స్‌ ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు ఎలమంచిలి బార్‌ కౌన్సిల్‌ మాజీ అధ్యక్షులు తళ్ళ సత్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచి చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి, ప్రాజెక్టు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, యూనియన్‌ నాయకులు కవిత, లక్ష్మీ రాజ్యం, మంగలక్ష్మీ, రమణమ్మ, జయ, ఆర్‌వి కె.లక్ష్మీ పాల్గొన్నారు.నర్సీపట్నంటౌన్‌:స్థానిక ఎన్‌టిఆర్‌ స్టేడియంలో అంగన్వాడీలు గురువారం 38వ రోజు సమ్మె కొనసాగించారు. ప్రాజెక్ట్‌ నాయకురాలు వి.సామ్రాజ్యం మాట్లాడుతూ, కనీసవేతనాలు, గ్రాడ్యూటీ, పిఎఫ్‌ ఈఎస్‌ఐలు అమలు చేయాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాస్ట్ర నాయకులు కె తిరుముర్తిలరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, ప్రాజెక్టు నాయకులు డి.మహలక్ష్మీ, మరణమ్మ పాల్గొన్నారు.కోటవురట్ల: స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.కొనసాగిన నిరసనలుపరవాడ : పరవాడ తాసిల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీల 38వ రోజు మోకాళ్ళపై నిలబడి జగన్మోహన్‌ రెడ్డికి దండం పెడుతూ నిరసన తెలిపారు. వీరికి యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి మద్దతు ప్రకటించి మాట్లాడారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు జి సత్యనారాయణ, సిఐటియు నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ నాయకులు సిహెచ్‌ దేవి, ఎం రమణి,ఎస్‌ పార్వతి, రామలక్ష్మి, అరుణ, శ్రీదేవి పాల్గొన్నారు.రాంబిల్లి : రాంబిల్లి తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీల చేస్తున్న నిరసన 38వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి. దేముడునాయుడు, యూనియన్‌ నాయకులు మంగ, సుజాత, నూకరత్నం, లక్ష్మి, అమ్మజి పాల్గొన్నారు.అనకాపల్లి : అంగన్వాడీలు స్థానిక నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో అంగన్వాడీలు 38వ రోజు నిరసన కొనసాగింది. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగశేషు, అంగన్వాడీలు పాల్గొన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిదేవరాపల్లి : అంగనవాడీలు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వ్యకాస నాయకులు డి.వెంకన్న, బిటి దొర, అంగన్వాడీలు జి.వరలక్ష్మీ, పి. కన్నతల్లి, సన్యాసమ్మ, కె.కోమలి, చెల్లయ్యమ్మ, జయ, రమణమ్మ పాల్గొన్నారు.విశాఖ కలెక్టరేట్‌ : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమ్మె 38వ రోజుకు చేరుకున్న సందర్భంగా 38వ అంకె రూపంలో కూర్చుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారికి మద్దతు తెలుపుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడారు. అంగన్‌వాడీల పోరాటం స్ఫూర్తిదాయ కమైందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు, బెదిరింపు చర్యలు మానుకుని వారి డిమాండ్లను నెరవేర్చాలన్నారు. అంగన్‌వాడీల పోరాటానికి టిడిపి యువ నాయకులు ఆడారి కిషోర్‌ కుమార్‌ సంఘీభావం తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా నాయకులు వై.తులసి, ఎఐటియుసి అనుబంధ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శ్యామలదేవి, కార్యదర్శి గుడివాడ అరుణ, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి పి.లక్ష్మి పాల్గొన్నారు. భీమునిపట్నం : ప్రభుత్వం జారీ చేసిన జిఒ 2 నోటీసులను ప్రదర్శిస్తూ అంగన్‌వాడీలు గురువారం భీమిలిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బీచ్‌ రోడ్డులోని శాఖా గ్రంథాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చిన్న బజారు మీదుగా కృష్ణా కాలనీలో ఉన్న ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్దకు చేరింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, యూనియన్‌ నాయకులు రవ్వ నరసింగరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) భీమిలి ప్రాజెక్ట్‌ గౌరవాధ్యక్షులు కె.వెంకటలక్ష్మి, అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, కొవ్వాడ లక్ష్మి, జిల్లా కోశాధికారి కె.పద్మావతి, వివిధ సెక్టార్ల లీడర్లు కోమలి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి : పెందుర్తి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె గురువారానికి 38వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె శిబిరాన్ని ఐద్వా నాయకులు అనంతలక్ష్మి, పౌర సంఘం నాయకులు ఇందిరా, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు మౌలాలి సందర్శించి సంఘీభావం తెలిపారు. మౌలాలి పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బృందావతి, దేవి, భవాని తదితరులు పాల్గొన్నారు.

➡️