వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన

Dec 14,2023 13:54 #anakapalle district
akp anganwadi strike on 3rd day

ప్రజాశక్తి-నక్కపల్లి(అనకాపల్లి) : నక్కపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం అంగన్వాడి వర్కర్స్ మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతి చేస్తామని హెచ్చరించారు. జనసేన నేత బోడపాటి శివ దత్ అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.దుర్గారాణి, యూనియన్ నాయకులు బి.సుబ్బలక్ష్మి, రమణమ్మ, సీత, నూకరత్నం, సత్య వేణి, కవిత, లక్ష్మి రాజ్యం, ఉమ్మడి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

➡️