నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన

Dec 15,2023 15:16 #anakapalle district
akp anganwadi workers protest 4th day

ప్రజాశక్తి – కశింకోట(అనకాపల్లి) : అంగన్వాడి కార్యకర్త సమస్యలు పరిష్కరించాలని సిఐటియు, ఐద్వా, సిపిఎం, ప్రజా సంఘాల డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ అంగన్వాడి హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ శుక్రవారం నిరసన చేపట్టారు కసింకోట జాతీయ రహదారి పక్కన తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలతో చిన్నపిల్లలతో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా నాయకులు డాకరపు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి కసింకోట యూనియన్ తనుజ కృష్ణవేణి వరలక్ష్మి, ఆకు లక్ష్మి జ్యోతి కమలకుమారి, రామలక్ష్మి అధిక సంఖ్యలో అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు.

➡️