అంగన్వాడీలు మానవహారం

Dec 21,2023 13:13 #anakapalli
akp anganwadi workers strike 10th day a

ప్రజాశక్తి-నక్కపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం అంగన్వాడీలు మానవహారం ప్రదర్శించారు.
కనీస వేతనం 26,000 చెల్లించాలని ,గ్రాట్యూటీ ,పెన్షన్ అమలు,తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు .ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ఏపీ అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.దుర్గారాణి, యూనియన్ నాయకులు బి.సుబ్బలక్ష్మి,రమణమ్మ ,సీత,నూకరత్నం,సత్య వేణి ,కవిత, లక్ష్మి రాజ్యం, ఉమ్మడి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు .

➡️