ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట అంగన్వాడీల ఆందోళన

Dec 27,2023 16:06 #anakapalle district
anganwadi strike 16th day akp

ప్రజాశక్తి-అనకాపల్లి : దేవరాపల్లి మండలం తారువాలో ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం అంగన్వాడీలు పెద్ద ఎత్తున అందోళన చేసి వినతిపత్రం సమర్పించారు మంత్రి సానుకూలంగా,స్పందించారు,ముఖ్యమంత్రి ద్రుష్టికి అంగన్వాడీలు సమస్యలు తీసుకువెళ్తామని హమి ఇచ్చారు,అనంతరం వారు మాట్లాడారు, అంగన్వాడీలను ప్రభుత్వం రోడ్డున పడేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంగళవారం మంత్రి బోత్స సత్యనారాయణ సజ్జల రాక్రుష్ణ రెడ్డితో జరిగిన చర్చలు మొక్కబడిగా జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడి వర్కర్స్’మినీ వర్కర్స్’ హెల్పర్స్ వేతనాలు పెంచాలని.గ్రాట్యూటి అమలు చేయాలి ఐసిడిఎస్ పటిష్ట పర్చాలని నాణ్యమైన సరుకులు అందించాలని డిమాండ్ చేస్తు.అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె 16 వ రోజు కు చేరుకుంది స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి 16 కోట్లు చీరలకు మొబైల్ కు 85 కోట్ల సెంటర్లు నిర్వహణకు రీచార్జీల కోసం 12 రూపాయలు ఇచ్చామని చేప్పడం హస్యస్పదమన్నారు ఇప్పటికీ ఆ మొబైల్స్ జిబీ,ర్యామ్ పని చేయక,సొంత మొబైల్స్ తో పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు.అనేక పర్యాయాలు ప్రభుత్వానికి గ్యాస్ ,ఆకు కూరలు, కూరగాయలు, పోపు దినుసులకు కోట్ల రూపాయలు మిగులు తాయని ప్రీస్కూల్ పిల్లలకు బోధించ వచ్చని యూనియన్లుగా అనేక పర్యాయాలు చెప్పినప్పటికీ టేక్ హోమ్ రేషన్ ప్రవేశ పెట్టారని. మరి దీనికి సంబంధించి ఎఫ్ ఆర్ ఎస్ యాప్ అదనంగా తెచ్చి తీవ్ర సమస్యలు తీసుకు వచ్చారని తెలిపారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చేప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీని అమలు చేయాలని నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక సార్లు సంబంధిత అధికారులకు మంత్రులకు ప్రభుత్వానికి తెలియ జేసిన ప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదన్నారు, ఇప్పటికే అంగన్వాడి సెంటర్లో తలుపులు బద్దలు కొట్టి గ్రామ సచివాలయం ఉద్యోగులతో నడుపుతూ మధ్యాహ్నం భోజన పథకం కార్మికులతో డ్వాక్రా మహిళలతో వంట చేపించడం అన్యాయమన్నారు అంగన్వాడి సెంటర్ లో ఒకటీచర్ ఆయా మాత్రమే ప్రజలందరికీ సర్వీసు అందిస్తున్నరని ఇప్పుడేమో అనేక రకాలుగా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న అందర్నీ తీసుకొచ్చి అంగన్వాడి సెంటర్లో పెట్టడం ప్రభుత్వానికి చిన్నతనంగా లేదా అని ప్రశ్నించారు చింతా ప్రతాప రెడ్డి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి నోటికి,నచ్చినట్లు మాట్లాడుతూ అంగన్వాడీలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూన్నారని మండిపడ్డారు. చింతా ప్రతాప రెడ్డి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు,ఈకార్యక్రమంలో. ప్రాజెక్టు కార్యదర్శి జి వరలక్ష్మి గౌరవ అద్యక్షరాలు జి,కూమారి ప్రాజెక్టు అద్యక్షరాలు భవానీ కోమాలి అమ్మాజి సన్యాసమ్మ తో పాటు నాలుగు మండలాలకు చేందిన అంగన్వాడీలుతో పాటు సిఐటియు జిల్లా నాయకులు ఆర్ దేముడు నాయుడు ఇ నరసింహమూర్తి బిటి దోర డి వెంకన్న. మద్దతు పలికారు.

➡️