మన్ను తిని బ్రతకాలనా!

Jan 19,2024 16:24 #anakapalle district
anganwadi workers strike 39th day akp

ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి మండలంలో అంగన్వాడీలు సమ్మే 39వ రోజుకు చేరుకుంది ఈసందర్భంగా కె కోటపాడు దేవరాపల్లి మండలాలకు, చెందిన వందలాది మంది అంగన్వాడీలు దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆకుల్లో మట్టి వేసుకోని తింటూ నిర్సన తెలిపారు. అనంతరం ప్రాజెక్టు గౌరవ అధ్యక్షురాలు జి కూమారి అద్యక్షరాలు భవానీ కోమాలి పద్మ అమ్మాజీ చేల్లయ్యమ్మ సన్యాసమ్మ తదితరులు మాట్లాడారు. 39 రోజులు నుండి సమ్మే చేస్తూఉంటే ప్రభుత్వం సమ్మేను విరమింప చేయకుంటే మన్నుతిని బ్రతకానా అంటూ అగ్రహాం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రతి అక్క చేల్లేమ్మలకు న్యాయం చేస్తానని తెలంగాణా అంగన్వాడీ,ఉద్యోగులు కన్నా వెయ్యిరూపాయలు వేతనం, పెంచుతామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి మోసం చేసి అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించిందన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సలహదార్లు చేత చర్చలు జరిపించి లక్షలాది మంది,అంగన్వాడీలను హేలన చేస్తున్నారని తెలిపారు. దీనికి ప్రతిఫలం ఆనుభవించక తప్పదని,హెచ్చరించారు. సజ్జల రామాక్రిష్ణ రెడ్డి లాంటి పనికి మాలిన సలహదార్లును పెట్టుకోని అంగన్వాడీలను చర్చలకు పిలిచి అంగన్వాడీలు సమ్మే వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పది డిమాండ్లు పరిష్కారం చేసెసామని, జీతాలు మాత్రం పెంచ లేమని అంగన్వాడీలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని సజ్జల రామాక్రిష్ణరెడ్డి అంగన్వాడీలపై దుస్ప ప్రచారం చేస్తున్నారని తెలిపారు,రెండవ ప్రక్కచర్చలకు పిలుస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిందన్నారు. దీనికి అంగన్వాడీలు సమాదానాలు వ్రాసి ఇవ్వడం జరిందన్నారు, అయిన ఉద్యోగాలు నుండి తీసివేస్తామని బెదింపులకు పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు వెంటనే ఎస్మా జీ వో ను ఉపసంహరించు కోవాలని లేదంటే మరింతగా సమ్మె ఉద్రుతం, చేస్తామని 17 నుండి విజయవాడలో నిరవధిక నిరాహారదీక్షలు, చేపాడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మే ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఇచ్చిన హామిని వెంటనే అమలు చేయాలని నాలుగున్నర సంవత్సరాలు ఓపిగ్గా ఉన్నామని ముందుగానే నోటిషులు ఇచ్చి చట్ట బద్దంగా సమ్మేచేస్తూఉంటే.అంగ న్వాడీలు సెంటర్లు తాళాలు బద్దలు గోట్టడం సచివాలయం ఉద్యోగులు చేత పనులు చేయించడం వంటి చర్యలకు. పూనుకున్నారని తెలిపారు. విదుల నుండి తోలగిస్తామని ప్రత్యన్మయ ఎర్పాట్లు చేసుకుంటామని సజ్జల రామాక్రిష్ణ రెడ్డి బెదిరింపులకు పూనుకుంటున్నారని తెలిపారు. మేము సజ్జల రామాక్రిష్ణరెడ్డికి ఓట్లు వేసి ఉద్యోగం చేస్తున్నామా! లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉద్యోగం చేస్తూన్నామా! అని ప్రశ్నించారు? వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోని అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మే మరింతగా ఉద్రుతం చేస్తామని వారు స్పష్టం చేసారు. ఈకార్యాక్రమానికి, వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న బిటి దోర kvps జిల్లా అద్యక్షులు గాడి ప్రసాద్ మద్దతు నిచ్చి మాట్లాడారు అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గోన్నారు.

➡️