రమణకు ఆర్థిక సహాయం

Mar 18,2024 13:09 #anakapalle district

అందజేసిన గొంతుని శ్రీనివాసరావు
ప్రజాశక్తి – కశింకోట :  కశింకోట మండలం బుచ్చయ్యపేట గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త తిర్రి.రమణ(అన్న) కాలికి ఆపరేషన్ అయ్యి రెండు వేళ్ళు తీసివేయడం జరిగింది. ప్రస్తుతం బెడ్ రెస్టులో వున్నా రమణకు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమవరం మాజీ  గ్రామ సర్పంచ్ గొంతిన శ్రీనువాసురావు పరామర్శించి కుటుంబ సభ్యులకు పది వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. రమణకు ఆర్ధిక సహాయం చేసినందుకు శ్రీనును బుచ్చియ్యపేట టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి అచ్చేర్ల టీడీపీ అధ్యక్షులు నైనంశెట్టి రమణారావు, తాళ్లపాలెం టీడీపీ అధ్యక్షులు ఉల్లింగల రమేష్, గంటా యువసేన కన్వీనర్ జెర్రిపోతుల నూకునాయుడు.ఎంపీటీసీ నాయుడు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు తిర్రి.చిరంజీవి, మండల సోషల్ మీడియా కన్వీనర్ బుదిరెడ్డి.రామారావు, కోన.నూకినాయుడు, నారిపల్లి ప్రసాద్ తిర్రి రమణ నాగేష్, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️