14న నిరసనలో పాల్గొనండి

Mar 13,2024 11:58 #anakapalle district

ప్రజాశక్తి-చీడికాడ : చీడికాడ మండలం బిజెపి ప్రభుత్వ, రైతాంగ, కార్మిక, వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, ఢిల్లీ రైతాంగంపై బిజెపి దాడిని ఖండించాలని మార్చి 14 చలో ఢిల్లీకి మద్దతు తెలపాలని రైతు సంఘాలు కోరాయి. జిల్లా మండల కేంద్రాల్లో జరుగు నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత కిసాన్ సభ మరియు కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా చీడికాడలో జరుగు నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సిఐటియు మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగని అల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 15 నెలల పాటు రైతాంగ పోరాటానికి తలోగ్గి దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి 21 డిసెంబర్ లో రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఈ హామీలను అమలు చేయాలని కోరుతూ నేడు ఢిల్లీ బయలుదేరిన హర్యానా సరిహద్దుల్లోనే అడ్డగించింది. కంద కాలు తవ్వడం, రోడ్లపై పెద్ద మేకులు నాటడం, బార్కేండ్లు, ముల్లకంచెలు ఏర్పరచడం, వాటర్ క్యాన్స్ ప్రయోగించడం, ప్రయోగించడంతో పాటు, డ్రోన్ల ద్వారా విషవాయువులు చిమ్మించింది. ఈ చర్యలు తో అనేక మంది రైతులకు కళ్ళు చూపు కోల్పోవడం, చెవులు వినపడకపోవడం జరిగింది. కాల్పుల్లో శుభకరంసింగ్ యువరైతు చనిపోయాడు. మరొక ముగ్గురు రైతులు గుండాగి చనిపోయారు. ఈ దారిలో 200 ట్రాక్టర్లు ధ్వంసం అయ్యాయి ప్రసారాం ఛానల్లో నిలిపి వేశారు.  కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగంపై దాడిని ఖండించాలని 14న జరుగు నిరసన కార్యక్రమంలో రైతాంగం అంతా పాల్గొనాలని కోరారు.

డిమాండ్స్

1. సోమనాదని కమిటీ సిఫార్సు అమలు చేయాలని

2. రైతుల రుణమాఫీ చేయాలని

3. కార్మికులను భానుసులుగా చేసి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని

4. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని

5. ఉపాదానికి కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు రూపాయలు కేటాయించాలని ” రెండు వందల రోజులు పని 600 వేతనం రూపాయలు ఇవ్వాలని”

6. ఆహార భద్రత చట్టం అమలు చేయాలని

7. విద్యుత్తు సంస్కరణ చట్టం 2020ని రద్దు చేయాలని, వాటర్ పంప్ షాట్లకు స్మార్ట్ మీటర్లు బిగించిరాదని,

8. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయరాదని,

9. పోలవరం నిధులు ఇవ్వాలని, అమరావతి రాజధాని నిర్మించాలని,

10. సమగ్ర పంటల బీమా సదుపాయాన్ని రైతులు అందించాలని

11. అటవీ హక్కుల చట్టం సవరణ లు ఉపసంహరించాలని

12. కౌలు రైతులకు సిసిఆర్ చట్టాన్ని సవరించి నష్టపరిహారం అందించాలని,

13. హర్యానా బార్డర్ లో రైతులపై జరిపిన కాల్పులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,

14. ప్రతి వ్యవసాయ కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారికి 6000 పెన్షన్ ఇవ్వాలని

15. డ్రైవర్లకు నష్టం కలిగించేబి ఎస్ ఎస్ సవరణ ఆపాలి.

ఈ కార్యక్రమంలో బోండకాయల వెంకటరమణ దేవుళ్ళు దేవుడమ్మ, నూకరత్నం, రాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️