విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

May 23,2024 13:27 #anakapalli

ప్రజాశక్తి-నక్కపల్లి : మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జనార్దన్ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది .గురువారం వేసవిజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ పోటీల్లో పాల్గొన్నారు .ఆంగ్ల ఉపాధ్యాయులు వెంకటరమణ పోటీలను పర్యవేక్షించారు. విద్యార్థుల్లో దాగువున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు గ్రంథాలయ అధికారి జనార్ధన్ వెల్లడించారు.

➡️