బకాయిలు వెంటనే చెల్లించాలి

Jan 24,2024 14:53 #anakapalle district
pay pending wages

ప్రజాశక్తి-దేవరాపల్లి : ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని, 2024 బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేయాలని, శ్రమకు తగ్గవేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న, వ్వవసాయకార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బిటి దోర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుధవారం దేవరాపల్లి మండలంలోని తామారబ్బ దేవరాపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలిలు పనులు చేస్తున్న చోటకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోని నిర్సన తెలిసిన అనంతరం వారు మాట్లాడారు. జిల్లాలోని గత సంవత్సరం వంద రోజులు పనులు పూర్తి అవ్వని కూలీలు ఈ సంవత్సరం ఆరువారాలు నుండి పనులు చేస్తున్నారని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడు వందలు కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని సకాలంలో తేల్లించక పండగ రోజుల్లో కూడా కూలీలు పస్తులు ఉన్నారని తెలిపారు. గత సంవత్సరం చేసిన పనులకు కూడా నేటి వరకు బిల్లులు చెల్లించలేదని వెంటనే భకాయిలు చేల్లించాలని డిమాండ్ చేసారు. ఈసంవత్సరం ఉపాధి చట్టానికి బడ్జెట్లో లక్ష కోట్లు కెటాయించాలని, అదార అనుసంధానం నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని రెండు వందలు రోజులుపని రోజుకి ఆరు వందలు కూలి ఇవ్వాలని, సమ్మర్ ఎలవెన్సులు తట్ట పార గునపాపంకు డబ్బులు కొనసాగించాని కోరారు. ప్రతి సంవత్సరం కేంధ్ర ప్రభుత్వం బడ్జెట్లో నిదులు తగ్గించకుంటా వస్తుందని దీని వలన వేతనాలు పడి పోతున్నాయని తెలిపారు. మేటిరియల్ చార్జీలు పెంచేయ్యడం కూలీలకు మరింతగా కేటాయింపు తగ్గి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు. వెంటనే పెండింగ్ భకాయిలు చేల్లించాలని బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేయాలని శ్రమకు తగ్గవేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.

➡️