ఘనంగా వడ్డాది ఉత్సవాలు ప్రారంభం

Mar 20,2024 12:58 #anakapalle district

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట(అనకాపల్లి జిల్లా) : వడ్డాది వెంకటేశ్వరస్వామి 151వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్త దొండా కన్నబాబు మంగళవారం రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనవాయితీ ప్రకారం స్వామివారికి దొంగ పెళ్లి నిర్వహించారు. పుట్టమన్ను తవ్వి ప్రమిదలలో వేసి వివిధ రకాల పంటల విత్తనాలు జల్లారు. ఉత్సవాల ముగింపు నాటికి ఏవిత్తనాలు మొలకెత్తుతాయో ఆరకం పంటలనే ఈప్రాంత రైతులు సాగు చేస్తారు. ఇది ఇక్కడి భక్తుల నమ్మకం. బుధవారం ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుండే స్వామి దర్శనానికి భక్తులు బారులుతీరారు. దూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లన్నీ కిక్కిరిసాయి.గోవింద నామాల స్మరణతో గిరిజాంబగిరి మారుమ్రోగింది. గ్రామములో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం, త్రాగునీరు అందించారు.

➡️