హక్కుల కోసం యుటిఎఫ్ రిలే నిరాహారదీక్షలు 

Feb 2,2024 13:20 #anakapalle district
utf protest in akp

ప్రజాశక్తి-అనకాపల్లి : ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్ధిక బకాయిల కోసం, CPS/GPS విధానం రద్దు కొరకు మరియు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఉదయం అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.
మొదటి రోజు దీక్షలను యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి వత్సవాయి శ్రీలక్ష్మి దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయుల మెడలో దoడలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల కు రావాల్సిన ఆర్ధిక బకాయిలు(DA, PRC, PF, APGLI, SL) చెల్లించకుండా, వాటిని దారి మళ్లించి, నేటికీ చెల్లించక పోవడం అన్యాయమన్నారు. అలాగే CPS / GPS విధానాలను రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం పునరుద్ధరిoచాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇది సరికాదని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎవరు దోచుకుంటున్నారని, ఆ సొమ్ము ఎక్కడ దాచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సిపీఎస్ ను రద్దు చేసి, ఓపిఎస్ ను పునరుద్ధరిస్తామని చెప్పి, జిపిఎస్ గా మార్చి ఉద్యోగులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే ప్రభుత్వo మున్సిపల్ ఉపాధ్యాయుల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందిని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కట్టా శ్రీను, గాయత్రి, కోశాధికారి జోగా రాజేష్, కార్యదర్శులు ప్రకాష్, పొలిమేర చంద్రరావు, సీనియర్ నాయకులు కృష్ణoరాజు, చిట్టియ్య, రాణి, నాగ మళ్లీశ్వరి, సత్తిబాబు, నాగభూషణం, వరప్రసాద్, సింహాచలం, శోభన్ బాబు, ఆనంద్, శ్రీనివాసు, మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️