ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసనహోరు..!

అనంతపురంలో మూతికి నల్లరిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

        అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన హోరును కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాడు సమ్మె మూడో రోజు సందర్భంగా కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని, ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. వీరి సమ్మెకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత సమ్మె శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. హెచ్‌ఆర్‌ అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులకు తాము అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ విజరు తదితరులు పాల్గొన్నారు.

➡️