అస్వస్థతకు గురైన అంగన్వాడీని పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు

అస్వస్థతకు గురైన అంగన్వాడీని పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు

గుత్తి సిడిపిఒపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

ప్రజాశక్తి-గుత్తి

అంగన్వాడీలు అస్వస్థతకు గురికావడానికి కారణమైన సిడిపిఒ ఢిల్లేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను సిపిఎం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను గుత్తి సిడిపిఒ భయభ్రాంతులకు గురి చేయడం వల్లే అంగన్వాడీలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. విధుల్లోకి చేరడానికి వచ్చిన అంగన్వాడీలతో ‘మీరు భవిష్యత్తులో సమ్మెలోకి వెళ్లమని, ధర్నాలు చేయబోమని’ రాసిస్తేనే జాయినింగ్‌ లెటర్‌ తీసుకుంటామని భయపెట్టారన్నారు. దీంతో ఒత్తిడితో నలుగురు అంగన్వాడీలు తీవ్ర అస్వస్థకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను వేధిస్తోన్న సిడిపిఒని తక్షణమే బదిలీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కసాపురం రమేష్‌, నాయకుడు సాకే నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️