ఉత్తమ పోలీసు సేవలకు పురస్కారాలు

ప్రశంసా పత్రాన్ని అందిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

         అనంతపురం క్రైం : ప్రజల మాన,ధన, ప్రాణాలను రక్షించడంలో గత నెల ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందిని, గ్రామమహిళా పోలీసులను ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ అభినందిస్తూ గురువారం నాడు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి దొంగలను అరెస్టు చేయడంతో పాటు జవాబుదారీగా సదరు సొమ్మును బాధిత ప్రజలకు అందజేయడం, సిసిటిఎన్‌ఎస్‌లో వివరాలను స్రక్రమంగా అమలు చేయడం, ఆత్మహత్యాయత్నాల నివారణ తదితర వాటికి సంబంధించి చొరవ చూపిన పోలీసులను సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా 49 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థికసాయం

కళ్యాణదుర్గం అర్బన్‌ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌ సురేష్‌ పని చేస్తూ ఈ ఏడాది అక్టోబర్‌ 25వ తేదీన అనారోగ్య కారణాలతో మరణించారు. 2009 బ్యాచ్‌నకు చెందిన ఈయన సహచర బ్యాచిమేట్స్‌ మానవతా థక్పథంతో సురేష్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా రూ.3.53 లక్షలను పోగుచేసి ఈ మొత్తాన్ని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ చేతుల మీదుగా చెక్కు రూపంలో మతుడి భార్య సుజాతకు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ అదనపు ఎస్పీ జి.రామకష్ణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సుధాకర్‌ రెడ్డి, గాండ్ల హరినాథ్‌ పాల్గొన్నారు.

➡️