ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలి

ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలి

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

ప్రజాశక్తి-ఉరవకొండ

కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలను సకాలంలో అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఉరవకొండలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంఎంయు, సిఆర్‌యు, ఎఫ్‌ఎంయు, ఎస్‌డబ్ల్యూపియు మొదలైన ఇన్‌ఛార్జిలను, వారి బృందాలతో షిఫ్ట్‌లవారీగా పని చేయాలన్నారు. ఎన్నికల నివేదికలను త్వరితగతిన అందించాలని ఆదేశించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని అనుమతులు, ఖర్చులు, మరియు క్లెయిమ్‌ల పరిష్కారం గురించి వివరించారు. ఈ సమావేశంలో ఇఆర్‌ఓ శిరీషా, తహశీల్దార్‌ శ్రీనివాసులు, వైసిపి, టిడిపి, బీఎస్పీ, సిపిఐ తదితర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️