ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల పోస్ట్‌కార్డ్‌ ఉద్యమం

Jan 3,2024 22:35

ప్రధానికి పోస్టుకార్డులు పంపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

అనంతపురం కలెక్టరేట్‌ : ‘ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నాం… మా ఉద్యోగాలకు భధ్రత లేకుండా పోయింది.. స్పందించి ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి’ అని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్‌ కార్డ్‌ ద్వారా విన్నవించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మె బుధవారం 15వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ ఛైర్మన్‌ విజరు అధ్యక్షతన నిర్వహించిన సమ్మెకు జిల్లాలోని ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొని ప్రధాన మంత్రి పోస్ట్‌కార్డ్‌ రాసి తపాల శాఖ ద్వారా పంపించారు. వీరి సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ఈశ్వరయ్య, అర్జున్‌, సాయిరాం, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌ హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లీలావతి, చైతన్య, సునీత, నాగరత్న, నరసింహమూర్తి, లక్ష్మినారాయణ, షాజహాన్‌, జలజాక్షి, మునెమ్మ, సునీత, శ్రీదేవి, రాజశేఖర్‌, మనోహర్‌, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

➡️