కవయిత్రి మొల్లమాంబకు నివాళి

కలెక్టరేట్లో మొల్లమాంబకు నివాళి అర్పిస్తున్న అధికారులు

           అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం ఉదయం తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్ల జిల్లా స్థాయి జయంతోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్భుకొఠారి, ఐసిడిఎస్‌ పీడీ బిఎన్‌.శ్రీదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ 16వ శతాబ్దపు తెలుగు కవియిత్రిగా ఆతుకూరి మొల్ల ఎంతో ప్రసిద్ధిగాంచారన్నారు. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రాసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు, కె.ఓబుళపతి, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు రామాంజనేయులు, శ్రీనివాసులు, జలాలపురం పోతులయ్య, సతీష్‌ కుమార్‌, లక్ష్మి నారాయణ, ఓబులేసు, సిండికేట్‌ నగర్‌ రామాంజనేయులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మారుతి పాల్గొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో మొల్లమాంబ జయంతి వేడుకలను బుధవారం ఉదయం నిర్వహించారు. మొల్లమాంబ చిత్ర పటానికి ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెల్లమాంబ విలువలతో కూడిన కవిత్వాన్ని సమాజానికి అందించారన్నారు. రామాయనాన్ని మొల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే తెలుగు భాషలో మొల్ల రామాయణం రచించారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌ రెడ్డి, జి.రామకృష్ణ, ఎస్‌.లక్ష్మినారాయణరెడ్డి, అనంతపురం రూరల్‌ డీఎస్పీ బివి.శివారెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఎఒ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️