కేంద్ర సాయుధ బలగాల కవాతు

కేంద్ర సాయుధ బలగాల కవాతు

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న కృష్ణంరెడ్డిపల్లి, పూలకుంట, చియ్యేడు, ఉప్పరపల్లి గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలు మంగళవారం కవాతు నిర్వహించాయి. అనం తపురం రూరల్‌ డీఎస్పీ బి.వి.శివారెడ్డి, బిఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ ధర్మేంద్రసింగ్‌, ఇటుకలపల్లి సి.ఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల గుండా కవాతు సాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాం దోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కును స్వేచ్ఛగా వినియో గించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని పోలీసులు తెలిపారు. అనంతపురం రూరల్‌ సబ్‌ డివిజన్‌ స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️