గవర్నర్‌ పర్యటనకు పటిష్ట చర్యలు : ఎస్పీ

Jan 5,2024 08:57

భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

          అనంతపురం క్రైం : రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈనెల 6వ తేదీన గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎస్పీ బుక్కరాయసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాల, అనంతపురం జెఎన్‌టియు ఆడిటోరియంలో ఏర్పాట్లను పరిశీలించారు. చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై దిశా నిర్ధేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, డీఎస్పీలు జి.ప్రసాదరెడ్డి, బివి.శివారెడ్డి, బుక్కరాయ సముద్రం సిఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ సిఐ వెంకటేష్‌ నాయక్‌, బుక్కరాయసముద్రం రెవెన్యూ, జెఎన్‌టియు అధికారులు ఉన్నారు.

➡️