గెలిపిస్తే కళ్యాణదుర్గం రూపురేఖలు మారుస్తా

గెలిపిస్తే కళ్యాణదుర్గం రూపురేఖలు మారుస్తా

 వైఎస్‌ఆ్సర్‌ చేయూత చెక్కు పంపిణీ చేస్తున్న ఎంపి తలారి రంగయ్య

ప్రజాశక్తి-కుందుర్పి

ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపుతానని నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపి తలారి రంగయ్య పేర్కొన్నారు. కుందుర్పి ఎంపీడీవో కార్యా లయ సమీపంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపి నాల్గో విడత వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సాగు, తాగునీరు తీసుకు రావడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కళ్యాణదుర్గం రూపురేఖలు మారుస్తాన ని తెలిపారు. నియోజవర్గ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా రూ. 150 కోట్లు మహిళలకు అందిం చామన్నారు. అభివృద్ధికి రూ. 2,140 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఎంపి నిధుల ద్వారా రూ. 350 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తాగునీటి కోసం 56 గ్రామాల్లో బోర్లు వేయించా మన్నారు. నాల్గో విడత కింద కుందుర్పి మండలానికి రూ. 6,84,37,500 చెక్కును పంపిణీ చేశారు. బాధితుల కు సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కుందుర్పి, జంబుగుంపల గ్రామాల్లో సచివాలయం, ఆర్‌బికె భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలా నాగరాజు, జడ్పిటిసి రాధాస్వామి, మం డల కన్వీనర్‌ సత్యనారాయణశాస్త్రి, సర్పంచి మారుతీశ్వరి రామ్మూర్తి, వైస్‌ ఎంపీపీలు భీమిరెడ్డి శ్రీలక్ష్మి, అజరుబాబు, ఎంపీటీసీ గంగమ్మ, హనుమంతరాయుడు, సింగిల్‌విండో ఛైర్మన్‌ వన్నూరురెడ్డి, రాము పాల్గొన్నారు.

➡️