జిల్లా అభివృద్ధి అందరి అజెండా కావాలి : సిపిఎం

జిల్లా అభివృద్ధికి సూచిస్తున్న ప్రతిపాదనలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి అందజేస్తున్న సిపిఎం నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా అభివద్ధి కోసం అన్ని పార్టీలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని సిపిఎం కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధుల బందం మంగళవారం నాడు అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిలను వారి నివాసాల్లో కలిసి సిపిఎం సూచిస్తున్న ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో ఈ ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారు వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఎత్తుల ద్వారా గెలవడం కాకుండా జిల్లా అభివద్ధికి స్పష్టమైన విధాన ప్రకటన చేసి దాని అమలు కోసం కషి చేయాల్సి ఉందన్నారు. ఇలా చేసి ప్రజల మనసులను గెలవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కేవలం ఒక్క శాతం సాగుభూమికి కూడా నికరమైన సాగునీటి వనరులు లేని జిల్లా అనంతపురం అన్నారు. కనీసం 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి చూపించే పరిశ్రమ లేకపోవడం జిల్లా వెనుకబాటుకు నిదర్శనం అన్నారు. రైల్వే కేంద్రంగా ఉన్న గుంతకల్లు గత 20 సంవత్సరాల్లో జనాభా తగ్గిపోవడం ఆందోళనకర పరిణామం అన్నారు. రాయదుర్గంలో జీన్స్‌ పరిశ్రమ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు. తాడిపత్రిలో బండల పరిశ్రమ ఇదే స్థితిలో ఉందని తెలిపారు. రైల్వే డివిజన్‌ అభివద్ధి కాకపోగా పేరు మార్పుతో డివిజన్‌ను తరలిస్తారనే ఆందోళన గుంతకల్‌ ప్రాంత ప్రజల్లో ఉందన్నారు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్న చిన్న పరిశ్రమలు మూతపడితే యువత భవితకు భరోసా ఉండదన్నారు. ఈ సమస్యలపై ఆయ పార్టీల అధినాయకత్వంతో జిల్లా అభివద్ధి అవసరమైన వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమల ఏర్పాటు, విద్య, వైద్యం, సామాజిక తరగతుల అభివద్ధి, మహిళ సంక్షేమంపై విధాన ప్రకటనలు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎస్‌.నాగేంద్ర కుమార్‌, ఎం.బాలరంగయ్య, నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, ముస్కిన్‌, వెంకట నారాయణ, ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️