జెఎన్‌టియులో ముగిసిన న్యాక్‌ పీర్‌ కమిటీ సందర్శన

జెఎన్‌టియులో ముగిసిన న్యాక్‌ పీర్‌ కమిటీ సందర్శన

మాట్లాడుతున్న విసి రంగజనార్ధన

అనంతపురం : అనంతపురం జెఎన్‌టియులో న్యాక్‌ పీర్‌ కమిటీ సందర్శన గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా విసి రంగజనార్ధన మాట్లాడుతూ అధ్యాపకులు, అందరి సహకారంతో న్యాక్‌ నుంచి మంచి గ్రేడ్‌ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి అధ్యాపకుడి సహకారంతోనే మంచి గ్రేడ్‌ వస్తుందన్నారు. అంతేగాకుండా న్యాక్‌ పీర్‌ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు వర్శిటీ సిబ్బందికి ఎంతగానో తోడ్పడుతాయన్నారు. ఇందులో భాగంగా రెండో రోజు టి.త్యాగ రాజన్‌ బృందం కళాశాలలో మెకానికల్‌ విభాగం, ఎంబీఏ, ఓటిపిఆర్‌ఐ, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, సివిల్‌ విభాగం, కెమికల్‌ విభాగం, డిస్పెన్షరీ విభాగాలను సందర్శించి పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. అనంతరం టి.త్యాగ రాజన్‌ను విసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, డైరెక్టర్‌ జి.వి.సుబ్బారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్లు, అనంతపురం కళాశాల ప్రిన్సిపాల్‌ యస్‌.వి.సత్యనారయణ, ప్రిన్సిపాళ్లు, వైస్‌ ప్రిన్సిపాళ్లు, అడహక్‌, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️