తొలిగించిన పింఛన్‌ ఇప్పించాలని వినతి

తొలిగించిన పింఛన్‌ ఇప్పించాలని వినతి

పింఛన్‌ను పునరుద్ధరించాలని ఎంపిడిఒకు విన్నవిస్తున్న పాపిరెడ్డి

 

నార్పల : తన భార్యకు తొలగించిన పింఛన్‌ను పునరుద్ధరించాలని మండల పరిధిలోని కురగానిపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి కోరారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎంపిడిఒ రాముడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ తన భార్య సుబ్బమ్మకు చాల కాలం నుంచి వృధ్యాప్య పింఛన్‌ వచ్చేదన్నారు. అయితే గత మూడు నెలల నుంచి పింఛన్‌ రావడం లేదని వాపోయాడు. వెంటనే తొలగించిన పింఛన్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు ఎంపిడిఒ స్పందిస్తూ కేసేపల్లి వెల్పేర్‌ అసిస్టెంట్‌కు వెంటనే ఫోన్‌లో మాట్లాడి పింఛన్‌ను ఎందుకు తొలిగించారో తెలపాలని వివరణ అడిగారు. అంతేగాకుండా అర్హత ఉంటే తొలగించిన పెన్షన్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు.

➡️