పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం

పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం

మాట్లాడుతున్న ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి

ప్రజాశక్తి-రాయదుర్గం

పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఎవరూ వైసిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్లలేదన్నారు. పట్టణంలోని తన నివాసంలో గురువారం మెట్టు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూసుకో మని అధిష్టానం ఆదేశించినందున నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతిని ధులు, నాయకులు, కార్యకర్తలు తనను కలిశారని, మిగిలిన వారు కూడా త్వరలోనే కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని, అభ్యర్థుల ఎంపిక, మార్పులు సర్వసాధారణం అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నారు. రాజకీయాల్లో ఉండి సంపాదించాలన్న ఆశ తనకు లేదన్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎపిఐఐసి ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శిల్ప, ఉపాధ్యక్షులు వలిబాషా, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి, పట్టణ కన్వీనర్‌ శివప్ప, చిక్కన్న, ఉషారాణి, మేకల శ్రీనివాసులు, జడ్పిటిసి పద్మావతి, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

➡️